జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ మోసగాడు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్ మోసగాడు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​

హైదరాబాద్, వెలుగు: జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్​ మోసగాడు అని కాంగ్రెస్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైతులు, ప్రజలను మోసం చేసిన ఏకైక పార్టీ బీఆర్​ఎస్​, కేసీఆర్​ అని అన్నారు. 

ఆదివారం అసెంబ్లీలో పద్దులపై ఆయన మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను పూర్తి చేయాలని, బడ్జెట్​లో దానికి శాంక్షన్​ ఇవ్వాలని, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.