
- మండలి చీఫ్ విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు
- అసెంబ్లీలో 4 నుంచి 6 కు పెరిగిన విప్ల సంఖ్య
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, మండలి చీఫ్‌విప్‌లు, విప్‌లను ప్రభుత్వం నియమించింది. శాసనసభ చీఫ్‌విప్‌గా దాస్యం వినయ్ భాస్క ర్, మండలి చీఫ్ విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. అసెంబ్లీ విప్‌లుగా గొంగిడి సునీత, గంప గోవర్ధన్, గువ్వల బాల రాజు, అరికెపూడి గాంధీ, రేగా కాంతా రావు, బాల్క సుమన్ లను… మండలి విప్ లుగా ఎంఎస్ ప్రభాకర్, భాను ప్రసాద్, దామోదర్ రెడ్డి, కర్నె లను సీఎం నియమించారు.
కేటీఆర్ సన్నిహితులకే చాన్స్‌లు
సీనియర్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కష్టమని కేటీఆర్ బుజ్జగించి ఒప్పించారని పార్టీలో ప్రచారం ఉంది. ఇక గత అసెంబ్లీలో విప్ లుగా పని చేసిన గొంగిడి సునీత, గంప గోవర్ధన్ కు మరోసారి చాన్స్ ఇచ్చారు. కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావులకు విప్ పదవి దక్కింది. గత అసెంబ్లీలో నలుగురే విప్ లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య అరుగురికి చేరింది. ప్రస్తుతం విప్ గా ఉన్న బోడకుంటికి చీఫ్‌విప్‌గా ప్రమోషన్ దక్కింది. కుల సమీకరణాల కోణంలో విప్ ల నియామకం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.