కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మందమర్రిలో కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చామని, ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని, మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని తన దృష్టికి రావడంతో రెండు కోట్లు శాంక్షన్ చేయించానని, రోడ్లకు 80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతోందని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్లు అందేలా కృషి చేస్తామని చెప్పారు. భూ దందాలు చేస్తే సహించేది లేదని, చట్టం ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలని, దందాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి నీటి ఇబ్బందులు ఉండద్దని, ఏమైనా నిధులు అవసరం ఉంటే వెంటనే కేటాయిస్తానని మున్సిపల్ కమిషనర్కు ఆయన సూచించారు. మందమర్రి మున్సిపాలిటీలో 20 లక్షల విలువ గల రెండు ట్రాక్టర్లను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.