బూత్​ ఇన్​చార్జీలతో ఎమ్మెల్యే వివేక్ ​సమావేశం

బూత్​ ఇన్​చార్జీలతో ఎమ్మెల్యే వివేక్ ​సమావేశం

కోల్​బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ బూత్​ ఇన్​చార్జీలు, బూత్​ మెంబర్లతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదివారం సాయంత్రం మంచిర్యాలలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల తీరుపై చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మండల, పట్టణ, జైపూర్​ మండలాలకు చెందిన ఇన్​చార్జీలు, మెంబర్లతో  రివ్యూ నిర్వహించారు. 

రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి పలు సూచనలు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, లీడర్లు పాల్గొన్నారు.