
మెహిదీపట్నం, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ విజయవంతంగా నడుస్తున్నాయంటే కారణం క్రమశిక్షణ అని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మెహిదీపట్నం హ్యూమయున్ నగర్లోని షెడ్యూల్డ్కులాల సాంఘిక సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన మాతా రమాభాయ్ అంబేద్కర్ ఆడిటోరియంను సోమవారం ఆయన ప్రారంభించారు.
ముందుగా అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియంను ప్రారంభించి మాట్లాడారు. హుమాయున్నగర్బస్తీతో తనకు 20 ఏండ్లుగా అనుబంధం ఉందని చెప్పారు. తన తండ్రి కాకా వెంకటస్వామి ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని, ఆయన స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటున్నామని చెప్పారు. ఇప్పటివరకు100 అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నిబద్ధతతో పనిచేయడానికి తన తండ్రి కాకానే కారణమన్నారు. నిజాయతీగా ఉంటున్నాను కాబట్టే ఎన్నికల టైంలో బీజేపీ చేయించిన ఈడీ రైడ్లు నిలవలేకపోయాయన్నారు.
ప్రతిఒక్కరికి విద్యను అందించాలన్న ధ్యేయంతో 1972లో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ను స్థాపించామని గుర్తుచేశారు. అంబేద్కర్స్ఫూర్తితో, కలిసి కట్టుగా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. బ్యాక్ లాగ్పోస్టులు భర్తీ విషయమై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆల్ఇండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ప్రొటెక్షన్సొసైటీ అధ్యక్షుడు మురళీధర్ రావు, ఆల్ఇండియా కాన్ఫెడరేషన్ఫర్ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్అధ్యక్షుడు మహేశ్వర్ రాజు, హుమాయున్నగర్ఎస్.కె.ఎస్.ఎస్.ఎస్అధ్యక్షుడు జి.సత్యనారాయణ, శివశంకర్, తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కప్ప కృష్ణ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
అనంతరం ఆడిటోరియం నిర్మాణానికి సాయం చేసిన దాతలను ఎమ్మెల్యే వివేక్ శాలవతో సన్మానించారు. నాయకులు బత్తుల చెన్నకేశవులు, అమృతరావ్, నాగరత్న, జమున, సత్యనారాయణ, కృష్ణమోహన్, ఆత్మకూరి క్రాంతి కిరణ్, రవీందర్, వరుణ్, వినయ్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.