కాంగ్రెస్​ సర్కారుతోనే అభివృద్ధి : వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్​ సర్కారుతోనే అభివృద్ధి : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు : కాంగ్రెస్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, కోటపల్లి, చెన్నూరు, జైపూర్​ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చేయడానికి ప్రణాళికలు తయారు చేసిందన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులుమంజూరు చేశామన్నారు. ఎన్నికల హామీ అమలులో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూ.70 లక్షల నిధులు మంజూరు​చేయించానని, నెలరోజుల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు. మున్సిపాలిటీల్లో లేఅవుట్ లేని ప్లాట్లకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. మున్సిపాలిటీలో సిబ్బంది కొరతతో అభివృద్ధి పనులపై ప్రభావం పడుతుందని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఖాళీలు భర్తీ చేయించేందుకు కృషి చేస్తాన్నారు. 

-మార్నింగ్​ వాక్​లో సమస్యలు తెలుసుకుంటూ..

శుక్రవారం ఉదయం చెన్నూరు మున్సిపాలిటీలోని ఐదు వార్డుల్లో ఎమ్మెల్యే వివేక్​మార్నింగ్​వాక్ చేసి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం నాలుగైదు వార్డులకు కలిపి ఒక ఎస్టీపీ ట్యాంకు చొప్పున నిర్మిస్తామన్నారు. ట్యాంకుల కోసం ఎస్టిమేషన్స్​ సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్​ను ఆదేశించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..  

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఏడో వార్డు సాయికుటీర్​లో రూ.18.8 లక్షల స్పెషల్​డెవలప్​మెంట్​నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, మూడో వార్డు ఇందిరనగర్​లో రూ.లక్షతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని లంబాడీపల్లెలో రూ.5 లక్షల ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మండలంలోని కిష్టంపేట సాయినగర్​లో  రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కోటపల్లి మండలం అన్నారం

గ్రామం ఎస్సీ కాలనీలో రూ.5 లక్షలతో సీసీ రోడుల, భీమారం మండల కేంద్రంలోని నేషనల్ హైవే నుంచి రైతు వేదిక వరకు ఎంఎన్ఆర్ఈజీ ఎస్ స్కీం కింద రూ.9 .50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే  శంకుస్థాపన చేశారు. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో సెగ్యం వాడలో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. జైపూర్ మండల కేద్రంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం, తాగునీటి కోసం బోర్ వెల్ పనులను ప్రారంభించారు.

రామకృష్ణాపూర్​బీజోన్ ఏరియాలోని ఇందిరానగర్​లో పోచమ్మతల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తిమ్మాపూర్​కు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో క్యాతనపల్లి మున్సిపల్​చైర్ పర్సన్​ జంగం కళ, వైస్​చైర్మన్​ఎర్రం సాగర్​రెడ్డి, మాజీ జడ్పీ వైస్​ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్​కౌన్సిలర్లు పోలం సత్యనారాయణ, కొక్కుల స్రవంతీసత్యనారాయణ, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపల్​ కమిషనర్లు గంగాధర్, మురళీకృష్ణ, ఏఈ అచ్యుత్, కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు.

మిషన్​ భగీరథ ఓ ఫెయిల్యూర్​ప్రాజెక్టు

మిషన్​ భగీరథ ఒక ఫెయిల్యూర్​ప్రాజెక్టు అని, వేల కోట్లు ఖర్చుతో రోడ్లను ధ్వంసం చేసి పైపులైన్లు వేసినా ఎక్కడా ఇంటింటికీ నీళ్లు రావడం లేదని ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా  చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, కోటపల్లి మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ భగీరథ స్కీం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా చుక్క తాగునీరు రావడం లేదన్నారు. కానీ పైపులైన్ల కోసం చెన్నూరు మున్సిపాలిటీలోని రోడ్లన్నీ తవ్వి ధ్వంసం చేసి, రిపేర్లు చేయకుండా వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిషన్ భగీరథ కోసం పాత పైపులు వేసి కాంట్రాక్టర్ బిల్లులు లేపుకుంటేటే, దాని ఓనర్ కోట్లు సంపాదించుకొని వెళ్లిపోయాడని వివేక్​ మండిపడ్డారు.