ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలి: వివేక్ వెంకటస్వామి

ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలి: వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు:  ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం రాత్రి చెన్నూరు నియోకవర్గం జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజా దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీతి కథలు, భక్తి పాటలు వింటే పిల్లలకు మంచి ఆలోచనలు కలుగుతాయన్నారు. దేవుడి ఆశీస్సులతో అందరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి మార్గంలో వెళ్లేందుకు దైవ్య కార్యక్రమాల్లో పాల్గొన్నాలని సూచించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి ప్రజలకు శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్​ లీడర్ బర్త్​డే వేడుకలకు హాజరు

మందమర్రిలో మంగళవారం రాత్రి జరిగిన కాం గ్రెస్​ లీడర్ గుడ్ల రమేశ్ బర్త్​డే వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేశ్​తో కలిసి కేక్ కట్ చేసి బర్త్​డే విషెస్ చెప్పారు. స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.