సాధారణ వ్యక్తిలా టీ తాగిన ఎమ్మెల్యే

సాధారణ వ్యక్తిలా టీ తాగిన ఎమ్మెల్యే

హైదరాబాద్,వెలుగు : ఎమ్మెల్యే అంటే మందీ మార్భలం తో పాటు ఎప్పుడు నలుగైదు కార్లు వెంటేసుకుని తిరుగుతుంటారు.  కానీ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యే అయినప్పటికీ భిన్నంగా వ్యవహారిస్తారు. 

తాజాగా అదే బాటలో  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్త గూడెం ఎమ్మెల్యే  కూనం నేని సాంబశివరావు నడిచారు. బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ లోని సీపీఐ స్టేట్ ఆఫీస్ ముందు సాధారణ వ్యక్తిలా వచ్చి టీ తాగారు. కూనంనేనిని గుర్తించిన టీస్టాల్ నిర్వహకుడు హనుమంతరావు యాదవ్ అభిమానంతో ఆయన్ను సన్మానించారు.