తీహార్ జైల్లో కవితను కేసీఆర్ పరామర్శిస్తే బాగుండేది:ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి

తీహార్ జైల్లో కవితను కేసీఆర్ పరామర్శిస్తే బాగుండేది:ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి

జనగామ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ పర్యటనపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  స్పందించారు.కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉంది.కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా నాలుగు బోర్లు వేయడం అనుమానంగా ఉందన్నారు. పక్కనే  పంట పొలంలో బోరులో నీరు వస్తోందన్నారు.

కాళేశ్వరం కుంగడం వల్లే నీరు దిగువకు విడుదల చేశారు దీనివల్అలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు యశస్విని రెడ్డి. దయాకర్ రావు, హరీష్ రావు, కేసీఆర్ పదిరోజుల వ్యవధిలో ఒక పొలంలో పర్యటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దయాకర్ రావు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి. 

కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జీ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పర్యటన  అంతా స్క్రిప్టెడ్.. కావాలనే నీటి రాజకీయాలు చేస్తున్నారు.. అసెంబలీలో అడుగుపెట్టని కేసీఆర్ ఇక్కడికి రావడం విడ్డూరం అన్నారు. రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.