గ్యారెంటీ స్కీమ్​లపై ఇంటింటి ప్రచారం

గ్యారెంటీ స్కీమ్​లపై ఇంటింటి  ప్రచారం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లా కేంద్రంలోని చిన్నదర్పల్లిలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గ్యారెంటీ స్కీమ్​లపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు గ్యారెంటీలు ప్రకటించినట్లు చెప్పారు. బీఆర్ఎస్  పార్టీ అమలు చేసిన స్కీములతో కార్యకర్తలు, నాయకులే లబ్ధి పొందారని విమర్శించారు. టీపీసీసీ జనర్​ సెక్రటరీ ఎస్. వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, చంద్రశేఖర్, ఎ.నాగరాజు, రమేశ్ నాయక్, బండి మల్లేశ్, అవేజ్, జహీర్, ఆంజనేయులు పాల్గొన్నారు.

అనంతరం పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు కోస్గి: ఆరు గ్యారెంటీలతో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్  పార్టీ మున్సిపల్  అధ్యక్షుడు బెజ్జు రాములు తెలిపారు. పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీమ్​లుగా ఏర్పడి ప్రజలకు ఆరు గ్యారెంటీలతో జరిగే లాభాలను వివరించారు. ఇద్రిస్, నాగులపల్లి శ్రీనివాస్, దేవేందర్, శ్రీనివాస్, నరేందర్  పాల్గొన్నారు.