Telangana Assembly : తప్పుడు జీవోలతో 800 ఎకరాలు హాంఫట్: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Telangana Assembly : తప్పుడు జీవోలతో 800 ఎకరాలు హాంఫట్:  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. స్వేచ్ఛా పాలనా కోసం ప్రతి ఒక్కరం కొట్లాడామని..కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన మొదలైందని చెప్పారు. ఫిబ్రవచి 9వ తేదీ శుక్రవారం బడ్జెట్ సమావేశాలు సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం ప్రజాపాలనను ప్రతిబింబిస్తోందన్నారు. ఉద్యమ సమయంలో జయజయహే తెలంగాణ గీతం స్ఫూర్తిని నింపిందని... ప్రజా ప్రభుత్వంలో జయజయహే.. తెలంగాణ రాష్ట్ర గీతం కావడం గర్వకారణమని చెప్పారు.

 మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు చేస్తామంటే విమర్శించారు... చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగే వారు ఇప్పుడు ఆటోల్లో వచ్చారని ఎద్దేవా చేశారు యెన్నం. నెల రోజులకే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు... గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.  ధనిక రాష్ట్రాన్ని  అప్పగిస్తే.. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారయ. తప్పుడు జీవోలతో దాదాపు 800 ఎకరాలు మాయం చేశారని మండిపడ్డారు.

గతంలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని చూశాం....  కానీ మా సీఎం సచివాలయం నుంచి పరిపాలన చేస్తున్నారన్నారు. సీఎంతోపాటు మంత్రులు కూడా అందరినీ కలుస్తూ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. మే పాలకులం కాదు.. సేవకులంగా పాలన చేస్తున్నామన్నారు. మేం చెప్పినట్లుగా టిఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. త్వరలోనే ధరణిని కూడా ప్రక్షాళన చేసి.. రైతుల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. టిఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని... కాంగ్రెస్ పాలనలో పారిశ్రామిక ప్రగతిని సాధిస్తామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.