ఐక్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్

ఐక్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్
  •     రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ఐక్యంగా ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్​ సూచించారు. 

పంచాయతీ ఎన్నికల్లో  గెలుపొందిన వారిని సోమవారం గోదావరిఖనిలోని తన క్యాంప్​ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కలిసి ముందుకు సాగాలని, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

జగిత్యాల రూరల్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గ పరిధిలో గెలిచిన సుమారు 70 మంది సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సోమవారం ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలను జగిత్యాల ప్రజలు పట్టించుకోకుండా అభివృద్ధి వైపే నిలిచారన్నారు. 

గిరిజన గ్రామాలు, తండాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని జిల్లా మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య,  రామచందర్ రావు, గిరి నాగభూషణం, జ్యోతి, హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు.