మా ఉద్యోగాల సంగతేంటి? .. అద్దంకిని నిలదీసిన నిరుద్యోగులు

మా ఉద్యోగాల సంగతేంటి? .. అద్దంకిని నిలదీసిన నిరుద్యోగులు

ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు నిరుద్యోగుల నుంచి నిరసన ఎదురైంది. లైబ్రరీలో రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగను నిర్వహించగా ఆయన గెస్ట్​గా హాజరయ్యారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ఆయనను చుట్టుముట్టి తమ ఉద్యోగాల సంగతేంటని ప్రశ్నించారు.

 జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా దయాకర్ వారికి సర్దిచెప్పారు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని అన్నారు. అనంతనం ఆయనకు నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు.