మాట ఇచ్చినం.. నిలబెట్టుకున్నం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

మాట ఇచ్చినం.. నిలబెట్టుకున్నం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు : టెట్ అర్హత సాదించినవారు డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉందని చెప్పటానికి ఇది నిదర్శనమని చెప్పారు. 

ఈ మేరకు శనివారం సీఎంకు ఆయన ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. 2024 టెట్ పాసైన అభ్యర్థులు డీఎస్సీకి ఎలాంటి ఫీజ్ లేకుండా అప్లై చేసుకోడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. అలాగే.. డిగ్రీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులు, ఓసీలకు 45 శాతం మార్కులు ఉన్నా ఇకపై ఉపాధ్యాయ పోస్టులకు అర్హులేనని సర్కార్​ ఉత్తర్వులు జారీ చేసిందని వెంకట్ పేర్కొన్నారు.