- ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని.. త్వరలోనే పీఆర్సీ, డీఏ, పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం తీపికబురు చెబుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. శనివారం కాగజ్ నగర్లోని ఆయన నివాసంలో పీఆర్టీయూ రూపొందించిన క్యాలెండర్, డైరీని యూనియన్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి టీచర్లు చేస్తున్న కృషి అమోఘం అని అన్నారు. రానున్న టెన్త్ వార్షిక పరీక్షల్లో స్టూడెంట్లు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు.
ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాసరావు, నాయకులు సునార్కర్ అనిల్ కుమార్, ఉప్పుల నరసింహాచారి, రాకేశ్, ప్రకాశ్, సాంబశివరావు, శ్రీను, రాంచందర్, కరుణాకర్, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
