హరీష్, ఈటలది కీలక పాత్ర..మిగత వాళ్లంతా బీటీ బ్యాచ్

హరీష్, ఈటలది కీలక పాత్ర..మిగత వాళ్లంతా బీటీ బ్యాచ్

మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూ ఆరోపణలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈటలపై కుట్రతోనే ఆరోపణలు వచ్చాయన్నారు. అసైన్డ్ భూముల విషయం తెరమీదకి తేవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  ఈటల కృషి పట్టుదలతో ఎదిగారని.. కావాలనే కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. 40 ఎకరాల భూమి విషయం కాదని.. ఆక్రమణకు గురైన వేలాది ఎకరాల భూములు బయటికి రావాలన్నారు.  ముందు జన్వాడ ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ పై విచారణ చేపట్టాలన్నారు. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని.. మంత్రి మల్లా రెడ్డిపై ఆరోపణలు, వక్ఫ్ బోర్డు భూములను అక్రమించిన మరో మంత్రిపై ఆరోపణలు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి చెరువు కబ్జా చేసిన పట్టించుకోలేదన్నారు.  ఉద్యమానికి అండగా నిలిచింది హరీష్ రావు, ఈటల మాత్రమేనని.. మిగతా అందరు బీటీ బ్యాచ్ అని అన్నారు. ఉద్యమ సమయంలో కేటీఆర్ , కవిత ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈటల ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారని.. సీఎం కనిపించకున్నా ముందుండి పనిచేస్తున్నాడన్నారు. 2004లో కేసీఆర్ ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో  విచారణ జరపాలన్నారు. కొంపల్లి భూములు ఏమయ్యాయని..నయీం డైరీ ఏమైందని..ఆ కేసు ఎంత వరకు వచ్చిందన్నారు.