కేసీఆర్​ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్​ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జగిత్యాలలోని ఇందిరాభవన్ లో ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ హాజరై రాజీవ్ గాంధీ ఆన్‌లైన్​ క్విజ్ పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రైమరీ స్కూళ్ల నుంచి ఉన్నత విద్యాలయాల వరకు అన్నింటినీ ప్రైవేట్​పరం చేశారని ఆరోపించారు. కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య ఏమైందని ప్రశ్నించారు. 

మన ఊరు మన బడి పథకం కింద 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కోసం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 317 జీవోను రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, దుర్గయ్య, జీవన్, వినయ్, విజయ్, మధు పాల్గొన్నారు.