ప్రజల దృష్టి మరల్చేందుకే పంటనష్టం పరిశీలన: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రజల దృష్టి మరల్చేందుకే పంటనష్టం పరిశీలన: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు :  మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం జగిత్యాలలోని ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కమీషన్ల కక్కుర్తి కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మించారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్‌‌ పంటనష్ట పరిశీలన యాత్రలు చేస్తున్నారన్నారు. పదేళ్లలో ఏనాడూ రైతుల పంటలను పరిశీలించని ఆయన.. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. 

కేసీఆర్‌‌ సీఎంగా సరిగ్గా పని చేయలేదని, కనీసం ప్రతిపక్ష నేతగానైనా  బాధ్యత నిర్వర్తించాలని హితవు పలికారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కొప్పుల పదేండ్లలో ఏనాడైనా ధర్మపురి నియోజకవర్గ సమస్యల కోసం కేసీఆర్ దగ్గరికి వెళ్లాడా అని ప్రశ్నించారు. తర్వాత అడ్లూరి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ లీడర్లు ఆయనను సత్కరించి విషెష్‌ చెప్పారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మున్సిపల్ చైర్‌‌పర్సన్‌ జ్యోతి, నాగభూషణం, నందయ్య, దుర్గయ్య పాల్గొన్నారు.