V6 , వెలుగును బ్యాన్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం : జీవన్ రెడ్డి

 V6 , వెలుగును బ్యాన్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం : జీవన్ రెడ్డి

V6 న్యూస్ , వెలుగు దినపత్రికలను బ్యాన్ చేయడం, క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఅన్నారు.  దీనిని తాను ఖండిస్తున్నానని తెలిపారు.  భారత రాజ్యాంగంలో వార్తా ప్రసార సాధనానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. రాష్ట్ర సాధన ఏర్పాటులో మీడియా ప్రధాన పాత్ర పోషించిందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. మరోవైపు పేపర్ లీకేజీపై మాట్లాడిన జీవన్ రెడ్డి.. దీనివలన నిరుద్యగ యువత నిరాశ నిస్పృహలకు లోనయ్యారని చెప్పారు. 

అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించకున్నప్పటికి కనీసం ప్రైవేట్ జాబునైనా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మెరుగైన ఉద్యోగాలు కల్పించాలన్న  ముఖ్య ఉద్దేశ్యంతోనే రాష్ట్రంలో ఉద్యమం మొదలైందని తెలిపారు.  పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని  జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ అధికారి వలన పొరపాటు జరిగిందో ఆ అధికారి ఆధ్వర్యంలోనే విచారణ జరిపించాని కోరారు. ఇక రద్దైన పరీక్షలో క్వాలిఫై అయిన వారికి  రూ. 1,00,000లు ఆర్థిక సాయం ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.