
పేపర్ లీకేజీ కేసులో టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేస్తే కేటీఆర్ బండారం బయటపడుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో మాట్లాడారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ ను విచారించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. పేపర్ లీకేజీ చర్చను కనుమరుగు చేసేందుకు తెర పైకి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని విమర్శించారు.
పేపర్ లీక్ కేసులో వాస్తవాలను ప్రశ్నించిన రేవంత్,బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చారని... లిక్కర్ స్కాంలో ఎందరినో అరెస్టు చేస్తున్నా కవితను మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. 30లక్షల మంది కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. టెన్త్ పేపర్ లీకేజీలో ప్రభుత్వ అసమర్ధత స్పష్టంగా కనబడుతుందన్నారు.