ఢిల్లీ వెళ్లి కేసీఆర్ మెడలు వంచుకున్నడు

V6 Velugu Posted on Nov 25, 2021

జగిత్యాల: ప్రధాని మోడీ మెడలు వంచుతానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మెడలు వంచుకున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగుబోతుల సంఘం అంతా కలిసి ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్‌కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. ప్రభుత్వ ఆఫీసర్లు మిల్లర్లకు ఏజెంట్లుగా మారారన్నారు.  


 

Tagged MLC Jeevan Reddy, Delhi, CM KCR,

Latest Videos

Subscribe Now

More News