కాళేశ్వరం డిజైనర్ ను ఉరి తీయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాళేశ్వరం డిజైనర్ ను ఉరి తీయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్‌‌‌‌, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్​చేసిన ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ను ఉరి తీయాలని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌‌‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ కుంగిన పాపం బీఆర్ఎస్ దేనన్నారు. కాళేశ్వరం పేరు చెప్పి బీఆర్ఎస్ లీడర్లు అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. టెక్నికల్‌‌‌‌, నిర్మాణ లోపాలతోనే మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ లీడర్లకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్ పై లేదన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తీవ్రవాద చర్యగా కేసు నమోదు చేయించారన్నారు.

కేటీఆర్ మేడిగడ్డ సందర్శనను స్వాగతిస్తున్నామని, అయితే ఆ పని మూడు నెలల కిందే చేసుంటే బాగుండేదన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు సరికాదన్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు ఆధిక్యత ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వైఫల్యం వల్లే ఓడారని, దానికి కూడా కాంగ్రెస్సే కారణమనడం హాస్యాస్పదమన్నారు. తాను ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చానని, కానీ కేసీఆర్ మంత్రి పదవి కోసమే పార్టీ నుంచి బయటికి వచ్చారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు నాగభూషణం, శంకర్, దుర్గయ్య, విజయలక్ష్మి, అశోక్ పాల్గొన్నారు.