మే 23లోగా కొనుగోళ్లు పూర్తికావాలి

మే 23లోగా కొనుగోళ్లు పూర్తికావాలి

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఈనెల 23లోగా వడ్ల కొనుగోళ్లు పూర్తిచేయాలని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామంలో ఐకేపీ సెంటర్లను ఎమ్మెల్సీ సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడుస్తున్నాయని, సకాలంలో కాంటా వేసి మిల్లర్లకు చేర్చాలని అధికారులకు సూచించారు.  అనంతరం రైతులతో మాట్లాడారు.