కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు

ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలుగా మారాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. చివరి గింజ వరకు కొంటానన్న సీఎం కేసీఆర్...ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనడం లేదంటున్నాడని విమర్శించారు. ధాన్యం సేకరణపై కేసీఆర్ ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఆందోళనకు గురి చేస్తోందని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. మొక్కజొన్నకు అయినా కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ఏమయిందని ప్రశ్నించారు.