ఆట స్థలం కోసం చెరువును పూడ్చడం సరికాదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆట స్థలం కోసం చెరువును పూడ్చడం సరికాదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా: ఆట స్థలం కోసం చెరువును పూడ్చడం పట్ల మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో క్రీడా ప్రాంగణం కోసం ఎర్రకుంట చెరువును చదును చేయడం వల్ల 120 మత్సకారుల కుటుంబాలకు ఉపాధి పోతోందంటూ ఆందోళ చేశారు. తమకు మద్దతు ఇవ్వాలని వేంపల్లి మత్స్యకారుల సంఘం సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిశారు. 

వేంపల్లి గ్రామంలోని ఎర్రగుంట చెరువును క్రీడా మైదానం కోసం పూడ్చు తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా మైదానం పేరుతో తమ ఉపాధికి గండి కొడుతున్నారని.. గ్రామస్థులకు జీవనాధారమైన చేపల చెరువును పూడ్చకుండా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని జీవన్ రెడ్డిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన మెట్ పల్లి ఆర్డీఓను కలిసి మాట్లాడారు. క్రీడా మైదానం పేరిట చెరువును పూడ్చడం సరికాదన్నారు. వెంటనే పనులు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని మెట్ పల్లి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.