గిట్టుబాటు ధర కల్పిస్తే కేసీఆర్ చెప్పిన పంటలే వేస్తాం

గిట్టుబాటు ధర కల్పిస్తే కేసీఆర్ చెప్పిన పంటలే వేస్తాం

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం అభినందనీయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతోనే ప్రజల దృష్టి మళ్ళించేందుకు రైతుల పేరిట ధర్నాల రాజకీయాలు చేస్తోందన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమామేశంలో మాట్లాడారు జీవన్ రెడ్డి.

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగల్లా మారి ధాన్యం కొనుగోలుపై రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనలో రైతులు పంటలు సాగు చేయాలన్నా కష్టాలే... పండించిన పంటలు అమ్ముకుందామన్నా కష్టాలు తప్పడం లేదన్నారు. నిజాం షుగర్స్ రీ ఓపెన్ చేయకపోతే కేసీఆర్ ను తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. ప్రతి పంటకు గిట్టుబాటు ధర రూ.25 వేలు చెల్లిస్తే సీఎం కేసీఆర్ చెప్పిన పంటలే వేస్తామన్నారు. 

గులాబీ సర్కారుపై గ్రామ గ్రామాన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు జీవన్ రెడ్డి. పేరుకు పోయిన ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.