రోళ్ల వాగు నిర్మాణంలో జాప్యం, సాంకేతిక లోపం మానవ తప్పిదమే : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రోళ్ల వాగు నిర్మాణంలో జాప్యం, సాంకేతిక లోపం మానవ తప్పిదమే : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా :  రోళ్ల వాగు నిర్మాణంలో జాప్యం, సాంకేతిక లోపం మానవ తప్పిదమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రోళ్ల వాగు, అర గుండాల ప్రాజెక్టు నుండి కోట్లాది విలువైన మత్స్యసంపద వరద పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని చెప్పారు. రోళ్ల వాగు నిర్మాణ వ్యయం రూ.60 కోట్ల నుండి 130 కోట్ల వరకూ పెరిగిందన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం
* అన్ని రాయితీలు నిలిపివేసి రైతుబంధు ఇవ్వడం తెలంగాణ మోడలా..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపి వేయడం తెలంగాణ మోడలా..? అని ప్రశ్నించారు. 

* ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించకపోవడం తెలంగాణ మోడలా..? అని ప్రశ్నించారు. 

* విత్తన రాయితీ తొలగించడం, పంట రుణ రాయితీ నిలిపివేయడం తెలంగాణ మోడలా..? 

* దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల రాయితీ తొలగించడం తెలంగాణ మోడలా..? 

* పంటల బీమా పథకం అమలు చేయకపోవడం తెలంగాణ మోడలా..? అన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.