భయంగా ఉంది కాపాడండి.. ఎమ్మెల్సీతో ఉక్రెయిన్ స్టూడెంట్ ఆవేదన

భయంగా ఉంది కాపాడండి.. ఎమ్మెల్సీతో ఉక్రెయిన్ స్టూడెంట్ ఆవేదన

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ ఉంటున్న వివిధ దేశాలకు చెందిన పౌరులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ తమ దేశాలకు చెందిన పౌరుల్ని ప్రత్యేక విమానాలు పంపి వెనక్కి రప్పించుకుంటున్నారు. మన భారతదేశానికి చెందిన అనేకమంది విద్యార్థులు కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. తాజాగా ఆ దేశంలో చిక్కుకుపోయిన జగిత్యాల జిల్లా  మెట్ పల్లి నివాసి భవాని అనే మెడికల్ స్టూడెంట్ తో  కాంగ్రెస్ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. 5 నిమిషాలకు ఒకసారి తమ దగ్గర బాంబులు పడుతున్నాయని ఈ సందర్భంగా భవాని ఎమ్మెల్సీతో తెలిపారు. తమను ఇక్కడి నుండి తరలిస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు భవాని.

ఇవి కూడా చదవండి:

గన్స్ తో పౌరులకు ట్రైనింగ్ ఇస్తున్న ఉక్రెయిన్

హెలికాఫ్టర్ క్రాష్ పై స్పందించిన కేంద్ర మంత్రి