ఉద్యోగులు ఉద్యమిస్తేనే సర్కార్ దిగొస్తుంది

ఉద్యోగులు ఉద్యమిస్తేనే సర్కార్ దిగొస్తుంది

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడంతో పాటు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో లక్ష 90వేల ఉద్యోగ ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పిందని..కొత్తజిల్లాలను ఏర్పాటు చేసి ఉద్యోగుల భర్తీ మరిచిపోయారని ఫైరయ్యారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మెరుగైన ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్…ఉద్యోగ సంఘాల నాయకుడినని చెప్పుకోవడం సిగ్గుచేటని…ఆయనకు మంత్రిగా కొనసాగే హక్కులేదన్నారు.

ఉద్యోగులు ఉద్యమిస్తేనే సర్కార్ దిగొస్తుందని, ఉద్యమ కార్యాచరణ రూపొందించి.. ముందుకు రావాలన్నారు. ఎన్టీఆర్ సమయంలో స్వామినాథన్.. ఉద్యోగుల కోసం పోరాటం చేశారని చెప్పారు. ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, దానికి సంబందించిన క్యాలెండర్ విడుదల చేయాలన్నారు.  పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి.. ఆశావహుల పేర్లను అధిష్టానానికి పంపించామని..త్వరలోనే అభ్యర్థులు ఖరారవుతారన్నారు.