గంగదేవిపల్లి గ్రామాన్ని సర్పంచులందరూ ఆదర్శంగా తీసుకోవాలి

గంగదేవిపల్లి గ్రామాన్ని సర్పంచులందరూ ఆదర్శంగా తీసుకోవాలి

వరంగల్ అర్భన్: గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి పేరుంటే బాగుంటుందని ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి సూచించారు. గ్రామ వెలుగు , గ్రామ జ్యోతి,గ్రామ దర్శనం లాంటి పేర్లను పరిశీలించాలని ప్రభుత్వానికి విన్నవించారు. విద్య, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా ప్రత్యేక కార్యాచరణ లో పెట్టాలని సూచించారు. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో గంగదేవిపల్లి లాంటి గ్రామాలు అభివృద్ధి చెందాయని, గంగదేవిపల్లి ని సర్పంచ్ లు ఆదర్శంగా తీసుకోవాలని కడియం అన్నారు. ప్రజల భాగస్వామ్యం తో ప్రజాప్రతినిధులు పని చేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. స్వచ్ఛ గ్రామము దిశగా గ్రామాలను పరిశుభ్రంగా పెట్టడం ద్వారా జబ్బులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. మన తర్వాత స్వాతంత్ర్యం పొందిన దేశాలు విద్య,వైద్యం లో మన కన్నా ముందు ఉన్నాయని కడియం తెలిపారు.