సొంత ఊరిలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకలు

సొంత ఊరిలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకలు
  •  
  • ఈ నెల 21న చింతమడకకు 
  • జాగృతి ప్రెసిడెంట్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత సొంత ఊరు చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ నెల 21న బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలి రోజు ఎంగిల పూల బతుకమ్మ ఆడనున్నారు. ఈ మేరకు కవిత పాల్గొననున్న షెడ్యూల్ ను  గురువారం  జాగృతి కార్యాలయం రిలీజ్ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్ లోని  తెలంగాణ జాగృతి కార్యాలయంలో, 23న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. 24న సిద్దిపేట జిల్లా వర్గల్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. 25న హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి ఉత్సవాలకు అటెండ్ కానున్నారు. 26 నుంచి 28 వరకు విదేశాల్లో వేడుకలకు హాజరు కానున్నారు.