రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ కాదు.. ఎన్నికల గాంధీ: ఎమ్మెల్సీ కవిత

రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ కాదు.. ఎన్నికల గాంధీ: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్/బోధన్, వెలుగు: తెలంగాణలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ బలం చూసి బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం ములుగు సభకు వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ దేశంలోనే చాలా ఫేమస్ అయిన అంకాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చికెన్‌‌‌‌‌‌‌‌ రుచి చూడాలని, డిచ్‌‌‌‌‌‌‌‌పల్లి రామాలయాన్ని విజిట్‌‌‌‌‌‌‌‌ చేసి పోవాలని సూచించారు. 

రాహుల్ ముత్తాత జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌ నెహ్రూ పునాది వేసిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు పనులు సీఎం కేసీఆర్ ఎలా పూర్తి చేశారో చూడాలన్నారు. పచ్చని పంటలు పరిశీలించి వెళ్లాలని, ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టొద్దన్నారు. ఎన్నికల టైంలో వచ్చి నాలుగు మాటలు మాట్లాడే రాహుల్ గాంధీని ఎన్నికల గాంధీ అనాలని విమర్శించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌‌‌‌‌‌‌‌లో బతుకమ్మ పండుగకు హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. 

గ్లోబలైజేషన్‌‌‌‌‌‌‌‌కు చిరునామాగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విద్య, వైద్యం, ఇరిగేషన్ రంగాల గురించి ఏనాడు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించని రాహుల్‌‌‌‌‌‌‌‌కు తెలంగాణలో ఏం పని? అని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో 8 వేల మంది బీసీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను విదేశాల్లో చదివిస్తున్నామని, తమది బీసీ ప్రభుత్వమని పేర్కొన్నారు.