
- ఆ యూనియన్తోనే పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో తన బలం పెంచుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సింగరేణిలో జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ అనుబంధ మైనర్స్ అండ్ఇంజనీరింగ్వర్కర్స్యూనియన్తో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకుంది. జాగృతికి అనుబంధంగా 'సింగరేణి జాగృతి' పని చేస్తుందని ఇటీవల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా.. సింగరేణిలో పెద్దగా బలం లేకపోవడంతోనే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈనెల 10న హైదరాబాద్‌లో హెచ్ఎంఎస్ యూనియన్, సింగ రేణి జాగృతి శ్రేణుల మీటింగ్ జరగనుంది. అదే రోజు హెచ్ఎంఎస్ఆధ్వర్యంలో సింగరేణి లో పనిచేస్తామని కవిత ప్రకటన కూడా చేయ నుంది. బీఆర్ఎస్అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకెఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేండ్లపాటు పని చేసిన కవితను కాదని ఇటీవల ఆ యూనియన్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్ చార్జ్ గా నియమించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే స్వతంత్ర యూనియన్అయిన హెచ్ఎంఎస్అనుబంధ 'ది సింగరేణి మైనర్స్అండ్ఇంజినీరింగ్వర్కర్స్యూనియన్'తో కలిసి పని చేసేందుకు కవిత నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి జాగృతి లీడర్లకు హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ, ఏరియా కమిటీల్లో కీలక పదవులను కూడా అప్పగించనున్నట్టు తెలుస్తోంది.