
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను తప్పుల తడకగా చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అది ఈ సమాజపు ఎక్స్రేనో.. సీటీ స్కానో కాదని శుక్రవారం ఓప్రకటనలో ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న రేర్ డేటా నిజమైతే తక్షణమే దాన్ని బయట పెట్టాలని, గ్రామ పంచాయతీలు, కులాల వారీగా సర్వే వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, సీఎం రేవంత్ రెడ్డిని ఆమె డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని, కుల సర్వే పారదర్శకంగా జరగలే దని, అందులో ఎన్నో లోపాలున్నాయని ఆమె ఆరోపించారు. 2014లో బీసీలు 52 శాతం ఉంటే, 2024కు వచ్చే సరికి 46 శాతానికి ఎలా తగ్గారని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాపై కొట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.