తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత

తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత

తెలంగాణ పండుగలకు బతుకమ్మ ప్రతీక అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. స్వరాష్ట్రం సాధించాక బీజేపీకి బుద్ధి వచ్చిందన్న కవిత.. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తుంటే బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వెలిగిపోతోందని కవిత అభిప్రాయపడ్డారు. 8 ఏళ్ల తర్వాత బీజేపీ నేతలు విమోచనం అంటున్నా, బతుకమ్మ ఆడుతున్నా అదంతా కేసీఆర్ గొప్పతనమని అన్నారు. తెలంగాణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పి విమోచనం అంటున్న బీజేపీ, గుజరాత్లో అదే పటేల్ విగ్రహం పెట్టి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఐకమత్యం గురించి మాట్లాడుతున్నారని కవిత విమర్శించారు. 

అంతకు ముందు తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మహిళలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ స్వీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.