ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు కవిత

ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకి వచ్చారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ మరి కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు విచారించనున్నారు కవిత. ఇవాళ మొత్తం కవిత ప్రగతి భవన్ లోనే ఉండనున్నారు.

మరో వైపు ఈడీ దర్యాప్తుపై కవిత వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో మార్చి 24న విచారణ జరగనుంది.  కవిత వేసిన పిటిషన్ పై ఈడీ వేసిన కేవియట్ పిటిషన్ ను ను కూడా సుప్రీం అదే రోజున విచారించనుంది. ఇరు వర్గాల వాదనలను సుప్రీం విననుంది.