ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్  విచారణ వాయిదా

లిక్కర్ కేసులో కవిత సాధారణ బెయిల్ పిటిషన్  విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండటంతో ఇవాళ జరగాల్సిన విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్ పై వాదనలు విననుంది సీబీఐ ప్రత్యేక కోర్టు. తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత సోమవారం కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.