
సికింద్రాబాద్ లో దివ్యాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న మొదలైన సేవా పక్షం కార్యక్రమాలలో భాగంగా.. శనివారం ( సెప్టెంబర్ 27 ) సికింద్రాబాద్ లోని హోమ్ ఫర్ ది డిసబుల్డ్ అనాధాశ్రమంలో మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కొమరయ్య.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మల్క కొమరయ్య. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును సేవా పక్షంగా నిర్వహించడం సమాజానికి ఎంతో మేలుచేసే నిర్ణయమని అన్నారు. దేశవ్యాప్తంగా దివ్యాంగులు, అనాథలు, అణగారిన వర్గాల కోసం ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు కొమరయ్య.
ALSO READ : ORR వైపు వెళ్లారంటే చుక్కలే..
సాయం చేయాలనే ప్రధాని మోదీ గారి సంకల్పం సమాజంలో సానుకూల మార్పుకు దారితీస్తోందని.. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు కొమరయ్య.ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ గారు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.