అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా : పాడి కౌశిక్ రెడ్డి

అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా : పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, వెలుగు: ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్​అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, మాచినపల్లి గ్రామాల్లో శుక్రవారం మహిళలు, కార్యకర్తలతో మీటింగ్​నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలవడం ఖాయమని, తెలంగాణలో కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, సర్పంచులు, ఇతర లీడర్లు పాల్గొన్నారు.