బాలాపూర్ లడ్డూను ఏపీ సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తా

V6 Velugu Posted on Sep 19, 2021

బాలాపూర్ లడ్డూను ఏపీ సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానన్నారు ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్. మర్రి శశాంక్ రెడ్డితో కలిసి వేలంలో రూ. 18.90 లక్షలకు బాలాపూర్ లడ్డూను  దక్కించుకున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే బాలాపూర్ లడ్డూ వేలంకు వస్తానని మొక్కుకున్నానన్నారు. ఏపీలో బాలాపూర్ లడ్డూకు చాలా క్రేజ్ ఉందన్నాన్నారు. 2019 కంటే బాలాపూర్ లడ్డూ లక్షా 90 వేలు ఎక్కువగా పలికింది. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం వేయలేదు.

 

Tagged Gift, balapur laddu, YSJagan, MLC Ramesh Yadav

Latest Videos

Subscribe Now

More News