సీపీఎస్ రద్దు కోసం సెప్టెంబర్ 1న మహాధర్నా..పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

సీపీఎస్ రద్దు కోసం సెప్టెంబర్ 1న మహాధర్నా..పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

బుధవారం పీఆర్టీయూ స్టేట్ ఆఫీసులో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మారం జగదీశ్, ఏలూరు శ్రీనివాస్ రావు , పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి తదితరులతో కలిసి మహాధర్నా పోస్టర్​ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.