- కేంద్రంపై తీన్మార్ మల్లన్న ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధిస్తూ కేంద్రం పేదల పొట్ట కొడుతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన గొప్ప చట్టాన్ని.. ఎన్డీయే సర్కారు నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. శనివారం శాసన మండలిలో ఉపాధి పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నిధుల విషయంలో కేంద్రం తప్పుకోవడం సరికాదన్నారు. మోదీ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోందిని పేర్కొన్నారు.
