
‘ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజాకళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న ‘దక్కన్ సర్కార్’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా” అన్నారు విజయశాంతి. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటి, ఎమ్మెల్సీ విజయశాంతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘వంద మంది ఆర్టిస్టులు, యాభై మంది టెక్నీషియన్ల కృషి ఈ సినిమాకు ఉంది.
తెలంగాణ ప్రాంతం నుండి ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, మరో లీడ్ యాక్ట్రెస్ మౌనిక పాల్గొన్నారు.