
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి మృతిచెందారు. ఆయన తండ్రి స్క్రీన్ రైటర్ ‘శివశక్తి దత్తా’ (92) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి (2025 జూలై 7న) కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. తెలుగు చిత్రాలలో సంస్కృత పాటలు రాసినందుకు గాను శివశక్తి దత్తా గుర్తింపు పొందాడు. సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆయన సోదరుడు. దర్శకుడు రాజమౌళికి పెదనాన్న. శివ శక్తి దత్తా మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
శివశక్తి దత్తా.. పలు సినిమాలకు పాటలు రాశారు. కేవలం సినిమాల్లో రచనలే కాకుండా ఆయనకు చిత్రలేఖనంలో కూడా అసాధారణ ప్రతిభ ఉంది. చిరంజీవి-వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో కూడా ఆయన పాటలు రాసినట్టు సినీ వర్గాల సమాచారం.
శివశక్తి దత్తా సినీ ప్రస్థానం:
కోడూరి శివశక్తి దత్తా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించాడు. 1988లో నాగార్జున హీరోగా వచ్చిన ‘జానకి రాముడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో రాణించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలిసి దర్శకత్వం వహించిన మూవీ అర్ధాంగి (1996). రవళి, ఆనంద్ హీరోహీరోయిన్లు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఫెయిల్ అయ్యింది.
ఆ తర్వాత శివశక్తి దత్తాసై మూవీలో ‘నల్లా నల్లాని కళ్ల పిల్ల’ , ఛత్రపతి ‘మన్నేల తింటివిరా, రాజన్న ‘అమ్మా అవని’ పాటలు రాశాడు. ఈ మధ్య కాలంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 సినిమాలో ‘మమతల తల్లి, ధీవర, బాహుబలి 2లో ‘సాహోరే బాహుబలి, ఎన్టీఆర్: కథానాయకుడు ‘కథానాయక, RRR లో రామం రాఘవమ్, హనుమాన్ మూవీలో ‘అంజనాద్రి థీమ్ సాంగ్ వంటి వివిధ సినిమాలకు సాహిత్యం అందించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (92) కన్నుమూత.
— Ramesh Pammy (@rameshpammy) July 8, 2025
ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు.
సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆయన సోదరుడు. దర్శకుడు రాజమౌళికి పెదనాన్న.
సై (నల్లా నల్లాని కళ్ల పిల్ల)
ఛత్రపతి (మన్నేల తింటివిరా)
బాహుబలి (మమతల తల్లి, ధీవర)
బాహుబలి 2… pic.twitter.com/peIuIDHU1U