MM Keeravani: ఏంటి ఇంకా సెట్ అవలేదా.. వైరల్ అవుతున్న కీరవాణి కామెంట్స్

MM Keeravani: ఏంటి ఇంకా సెట్ అవలేదా.. వైరల్ అవుతున్న కీరవాణి కామెంట్స్

దర్శధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్న సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. యాక్షన్, అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకాలేదు. 

ఈ నేపధ్యంలోనే ఇటీవల మహేష్, రాజమౌళి కథ సెట్ అయ్యిందని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి తాజాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. నేనింకా ఈ ప్రాజెక్ట్ పై వర్క్ స్టార్ట్ చేయలేదని. కథ కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. మరోవారంలో కథ లాక్ అవుతుంది. టెస్ట్ షూట్స్ కూడా జరుగుతున్నాయని. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు కీరవాణి. 

కీరవాణి చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ మళ్ళీ డైలమాలో పడ్డారు. కథ అంతా సెట్ అయింది, రేపో.. మాపో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది అని అనుకుంటున్నా సమయంలో. కథ ఇంకా కంప్లీట్ అవలేదు అని బాంబు పేల్చాడు కీరవాణి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథ ఫైనల్ అయ్యిందా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లియర్ గా చెప్పండి సార్.. అంటూ అడుగుతున్నారు.