న్యూ ఇయర్​కు ఎంఎంటీఎస్ స్పెషల్ రైళ్లు

న్యూ ఇయర్​కు ఎంఎంటీఎస్ స్పెషల్ రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: న్యూ ఇయర్ నేపథ్యంలో  హైదర్​నగర్​లోని కల్వరి టెంపుల్​లో జరిగే వేడుకలకు హాజరయ్యే వారి కోసం ఎంఎంటీఎస్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

లింగంపల్లి – ఫలక్ నుమా,  లింగంపల్లి – హైదరాబాద్(నాంపల్లి) స్టేషన్ల మధ్య ఈ నెల 31న అర్ధరాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ అవకాశాన్ని ప్యాసింజర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు