గుంపుగా వచ్చి EVM, VVPATలను చెరువులో వేసిండ్రు

గుంపుగా వచ్చి EVM, VVPATలను చెరువులో  వేసిండ్రు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చివరి విడద లోక్ సభ  ఎన్నికల్లో భాగంగా శనివారం 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. దక్షిణ 24 పరగణాస్‌లోని కుల్తాయ్‌ 40,41 పోలింగ్ బూత్ లో జనాలు గుంపుగా వచ్చి ఓటింగ్ మిషన్లను  తీసుకెళ్లి చెరువులో పడేశారు. పోలింగ్ బూత్ సెక్టార్ ఆఫీసర్ దగ్గరున్న పేపర్లను లాక్కొని వెళ్లారు.

దాదాపు ఇరవై ముప్పై మంది ఒకేసారి గుంపుగా పోలింగ్ బూత్ లోకి వచ్చి EVM, VVPATలను ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న చెరువులో వేశారని పోలింగ్ సిబ్బంది తెలిపారు. దీనిపై పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ స్పందించారు. సెక్టార్ ఆఫీసర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన అన్నారు. సెక్టార్ ఆఫీసర్ కు కొత్త ఈవీఎం మిషన్లు, పేపర్లు ఇచ్చారు. భద్రత ఇంకా కట్టుదిట్టం చేశారు.