గండిపేట, వెలుగు: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరామనగరం ముచ్చింతల్లోని సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) సందర్శకులకు ఈ నెల 11న ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1998లో భారతదేశం విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షల(ఆపరేషన్ శక్తి) గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సాధారణంగా భద్రత, ఆధ్యాత్మిక వాతావరణం దృష్ట్యా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదు. అయితే సాంకేతికత దినోత్సవానికి ప్రయార్టీ ఇస్తూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు.
