మోడల్​ స్కూల్​ అడ్మిషన్స్​

మోడల్​ స్కూల్​ అడ్మిషన్స్​

మోడల్ స్కూల్స్ లో 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఎంట్రన్స్ టెస్టు ద్వారా ఆరు నుంచి పదోతరగతి వరకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆరో తరగతిలో మెరిట్ ద్వారా నేరుగా ప్రవేశం కల్పిస్తుండగా, ఏడు నుంచి పదో తరగతికి లేటరల్ ఎంట్రీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 12న రాత పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో మోడల్ స్కూల్స్ పరీక్ష విధానం, నోటిఫికేషన్ వివరాలు, ఎగ్జామ్‍టిప్స్ ఈ వారం గైడ్ టు విన్‌లో..

రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన మండలాల్లో క్వాలిటీ ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు 194 ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్‌‌) ప్రారంభించారు. ఒక్కో స్కూల్‍లో ఆరోతరగతికి వంద సీట్లుంటాయి. మిగిలిన క్లాసుల్లో బ్యాక్ లాగ్ వేకెన్సీస్ ఆధారంగా అడ్మిషన్లు జరుపుతారు. మోడల్ స్కూల్స్‌‌లో ఫీజు ఉండదు. ఫ్రీ అకామడేషన్‌‌తో పాటు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలు ప్రొవైడ్ చేస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధనతో పాటు నీట్, ఎంసెట్, జేఈఈ, సీఏ, సీపీటీ, టీపీటీ, సీఎస్ వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఉచితంగా పొందొచ్చు. నాణ్యమైన విద్య అందిస్తూ ఇటీవల పాపులర్ అవుతున్న మోడల్ స్కూల్స్ లో వేల సీట్లకు లక్షల మంది పోటీ పడుతుంటారు.

సెలెక్షన్ ప్రాసెస్

సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్‌‌లో వంద మార్కులకు మొత్తం 100 ప్రశ్నలుంటాయి. క్వశ్చన్​పేపర్​ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉంటుంది. ఈ పేపర్‌‌లో తెలుగు, మ్యాథమెటిక్స్‌‌, ఎన్విరాన్‌‌మెంటల్ సైన్స్ (సైన్స్ & సోషల్), ఇంగ్లిష్ అనే నాలుగు సెక్షన్ల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశించే విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్‌‌లో ఒక్కో సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలతో వంద మార్కులకు సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ టెస్ట్స్ డ్యురేషన్ రెండు గంటలు. ఉదయం ఆరోతరగతి, మధ్యాహ్నం ఏడు నుంచి పదో తరగతికి ఎంట్రెన్స్​  టెస్ట్ నిర్వహిస్తారు.

ప్రిపరేషన్ టిప్స్

మోడల్ స్కూల్ ఎగ్జామ్ లో ప్రశ్నలు ఐదో తరగతి స్థాయిలో ఉంటాయి. పుస్తకాల్లో ఉండే లెసన్స్, కథలు, ఎక్సర్‌‌సైజెస్, ఇతర కంటెంట్ నుంచే ప్రశ్నలిస్తారు. దాదాపు 95 శాతం క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచే అడుగుతారు కాబట్టి విద్యార్థులు ఐదో తరగతి వరకు ఉండే పుస్తకాల్లోని టాపిక్స్ ను బాగా చదువుకోవాలి. ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్ ను విశ్లేషించుకొని ఏ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గమనించి దానికనుగుణంగా ప్రిపేరవ్వాలి. గత ఐదారేళ్ల ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేసి ప్రిపరేషన్ కొనసాగిస్తే సిలబస్ ను ఎలా చదవాలో అవగాహన వస్తుంది. – ‌‌వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్

 

తెలుగు

తెలుగులో గ్రామర్‍కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక పేరాగ్రాఫ్‍ (చిన్న కథ/గద్యం) ఇచ్చి దాని ఆధారంగా 5 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లుంటాయి. పేరాను చదివి విద్యార్థులు వాటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత పదాలు–‌‌అర్థాలు, జాతీయాలు, సామెతలు వంటి వాటిపై ఐదు ప్రశ్నలు ఇస్తారు. అలాగే వాక్యాలు, సంయుక్తాక్షరాలు, జంటపదాలు, నానార్థాలు, వ్యతిరేకపదాలు, నామవాచకాలు, కాలాలు, సర్వనామాలు, క్రియలు, విభక్తి ప్రత్యయాలు వంటి భాషాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కవులు వాటి బిరుదులు, తెలుగు సంస్కృతి, పండుగల చరిత్ర, జనరల్ నాలెడ్జ్ ను పరీక్షించేవిగా ఉంటాయి. ఐదో తరగతి వరకు ఉండే తెలుగు పాఠ్యాంశాలు, కథలు వాటి సారాంశాలు, అందులో ఉండే నీతి వంటి అంశాలు క్షుణ్నంగా చదువుకోవాలి.

గత ప్రశ్నలు

  1. వేదుల సత్యనారాయణ శాస్త్రికి గల బిరుదు?

ఎ) కవికోకిల      బి) గాన కోకిల

సి) గౌతమీ కోకిల డి) భారత కోకిల

  1. కింది వాటిలో సామెతను గుర్తించండి.

ఎ) అందెవేసిన చేయి

బి) ఆర్నెళ్లు సహవాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు.

సి) కళ్లు నెత్తికెక్కు

డి) నోట్లో నాలుక లేని మనిషి

  1. కింది పదాలలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి.

ఎ) వన్నె చిన్నలు         బి) వస్త్రం

సి) మట్టి బొమ్మ  డి) పట్నం

  1. కవిత గేయాన్ని రాసింది. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి.

ఎ) కవిత          బి) గేయం

సి) రాసింది       డి) పైవేవి కావు

  1. తెలుగు బాల రాసింది ఎవరు?

ఎ) కరుణశ్రీ       బి) బద్దెన

సి) వేమన        డి) అరుణ శ్రీ

మ్యాథమెటిక్స్

గణితంలో నంబర్స్, నంబర్ సిరీస్, కొన్నవెల, అమ్మినవెల, పని–కాలం, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, కోణాలు, ఉమ్మడి గుణిజాలు, సరాసరి, స్థాన విలువలు, క్యాలెండర్‍, భిన్నాలు, తీసివేతలు, కారణాంకాలు, స్థాన విలువలు, వంటి వాటిని బాగా చదువుకోవాలి.

గత ప్రశ్నలు

  1. కింది వాటిలో 2 చేత నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య ఏది?

ఎ) 68473              బి) 84371

సి) 53742             డి) 34785

  1. చతురస్రానికి గల సౌష్టవ రేఖల సంఖ్య?

ఎ) 2       బి) 1      సి) 4       డి) 3

  1. కింది వాటిలో 3, 4, 5, 10 ల ఉమ్మడి గుణిజం ఏది?

ఎ) 30     బి) 40    సి) 50    డి) 60

  1. చైనీయులు రూపొందించిన టాన్ గ్రాము లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి?

ఎ) 7       బి) 5      సి) 1       డి) 2

  1. 63837 లో 3 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత?

ఎ) 3030                బి) 3837

సి) 3333                డి) 3000

ఎన్విరాన్‌‌మెంటల్​ సైన్స్

ఈ విభాగంలో సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లోని జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, ఫిజిక్స్, భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం వంటి సెక్షన్ల నుంచి ప్రశ్నలడుగుతారు. దాదాపు అన్ని ప్రశ్నలు పాఠ్య పుస్తకాల్లో నుంచే వస్తాయి కాబట్టి ఐదో తరగతి పుస్తకంలోని అన్ని చాప్టర్లను క్షుణ్నంగా చదవాలి. అవి కూడా నిత్యజీవితంలోని సంఘటనలు లేదా వాటికి సంబంధించిన అంశాలనుంచే అడుగుతారు.

గత ప్రశ్నలు

  1. కింది వాటిలో దేని వల్ల నేల గుల్లబారుతుంది?

ఎ) చీమ          బి) సాలెపురుగు

సి) వానపాము   డి) పాము

  1. గుస్సాడి నృత్యంలో గోండులు వేటితో అలంకరించుకుంటారు?

ఎ) కొమ్ములు     బి) పూసల దండలు

సి) నెమలి ఫించాలు       డి) అద్దాలు

  1. శరీరంలో రోగకారక క్రిములతో పోరాడే కణాలు ఏవి?

ఎ) ఎర్ర రక్త కణాలు         బి) తెల్లరక్తకణాలు

సి) రక్త ఫలకికలు డి) ఎ మరియు సి

  1. మనదేశంలో సౌరశక్తిని ఎక్కువగా వాడే రాష్ట్రం ఏది?

ఎ) రాజస్థాన్      బి) గుజరాత్

సి) అసోం         డి) ఆంధ్రప్రదేశ్

  1. నాగోబా ఆలయం ఉండే ప్రదేశం

ఎ) మహబూబ్ నగర్      బి) అదిలాబాద్

సి) అరకు         డి) తూర్పు గోదావరి

ఇంగ్లిష్‍

ఇందులో ఒకటి లేదా రెండు పేరాగ్రాఫ్‍లు ఇచ్చి వాటి ఆధారంగా ఒక్కో పేరాగ్రాఫ్‍కు ఐదు ప్రశ్నలు అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆర్టికల్స్, జెరండ్‍, పార్ట్ ఆఫ్ స్పీచ్, సిననిమ్స్, రైమింగ్ వర్డ్స్, అబ్రివేషన్స్, ఆంటోనిమ్స్, టెన్సెస్‍, స్పెల్లింగ్స్, కన్‍జంక్షన్స్ వంటి టాపిక్స్ ను బాగా చదువుకోవాలి.

గత ప్రశ్నలు

  1. Choose the word that does not refer to a place
  2. a) School b) Bathroom
  3. c) Home d) Courtier
  4. Choose the word with wrong spelling
  5. a) Enough b) Strength
  6. c) Heavy d) Redy
  7. Helen joined a Political party. She became a famous________

Choose the word to fill in the blank.

  1. a) Politics b) Politician
  2. c) Politically d) Political
  3. Yesterday was Monday. In this sentence Yesterday is
  4. a) an adjective b) an adverb
  5. c) a noun d) a verb
  6. Choose the correct pair of rhyming words
  7. a) see – meals b) see – eels
  8. c) see – free d) see – fish