వచ్చే 4 రోజులు మోస్తరు వానలు

వచ్చే 4 రోజులు మోస్తరు వానలు
  • జగిత్యాలలో 44 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం పలు జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయని చెప్పింది. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నయ్‌‌‌‌. సోమవారం జగిత్యాల జిల్లాలోని జైనలో అత్యధికంగా 44.2 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ రికార్డయ్యింది. ఈ సీజన్‌‌‌‌లో ఇదే హయ్యెస్ట్‌‌‌‌ అని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌‌‌‌లోని భోరజ్‌‌‌‌లో 44.1, హనుమకొండలోని ధర్మాసాగర్‌‌‌‌, 
నిజామాబాద్‌‌‌‌లోని సిరికొండలో 43.6 డిగ్రీల చొప్పున, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌లోని కెరమెరిలో 43.2, నిర్మల్‌‌‌‌లోని లింగాపూర్‌‌‌‌లో 43, మంచిర్యాలలోని భీమిని, ములుగులోని మేడారంలో 42.6 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.